![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -317 లో.. తోటికోడళ్ళిద్దరూ గొడవ పెట్టుకుంటు ఉంటే అది చూడలేని ఇందిరాదేవి.. అందరి ముందు కాకుండా బయటకు తీసుకొని వెళ్లి మందలిస్తుంది. ఎవరో చెప్పుడు మాటలు విని మీరు ఇలా అవుతున్నారు. ఈ ఇంట్లో ఎవరు ఎవరిని తక్కువగా చూడడం లేదు. అది గుర్తు పెట్టుకొని మసులుకోండి. ఇలా గొడవపెట్టుకొని మీ కోడళ్ళకి ఏం నేర్పాలని అనుకుంటున్నారు. ఇక మీదట మీరు గొడవపడితే బాగుండదంటు అపర్ణ, ధాన్యలక్ష్మిలకి వార్నింగ్ ఇస్తుంది ఇందిరాదేవి. ఆ తర్వాత అక్క సారీ అని ధాన్యలక్ష్మి చెప్పగానే.. నేను ఎవరి జోలికి పోను అంటు కోపంగా అపర్ణ అక్కడ నుండి వెళ్ళిపోతుంది.
కాసేపటికి టాబ్లెట్స్ తీసుకొని రమ్మని రుద్రాణికి స్వప్న చెప్పగానే.. తను టాబ్లెట్స్ తీసుకొని వస్తుంది. వాటిని చూసి స్వప్న ఫోటో తీసుకొని ఒక వీడియో రికార్డు చేస్తుంది. నా పేరు స్వప్న వీళ్ళు నా అత్త, నా భర్త. కడుపుతో ఉన్న నాకు టాబ్లెట్ తీసుకొని రమ్మని చెప్తే వీళ్ళు ఎక్స్ పైరీ డేట్ అయిపోయిన టాబ్లెట్స్ తీసుకొని వచ్చి.. నన్ను చంపాలని చూస్తున్నారని చెప్పి వీడియో రికార్డు చేస్తుంది. ఇది ఇంట్లో వాళ్లకి చూపిస్తాను. పోలీసులకి, మీడియావాళ్లకి చూపిస్తానని చెప్పగానే.. రాహుల్ రుద్రాణి ఇద్దరు భయపడి.. నేను చూసుకోకుండా తీసుకొని వచ్చానని రాహుల్ అంటాడు. ఇంకోసారి ఇలా జరగదని స్వప్న కిందకి వెళ్లి ఇంట్లో వాళ్లకి చెప్పకుండా రుద్రాణి, రాహుల్ ఇద్దరు రిక్వెస్ట్ చేస్తారు. సరే ఈ ఒక్కసారి క్షమిస్తున్న అంటు స్వప్న చెప్తుంది. ఆ తర్వాత ఏం టిఫిన్ చేయాలని అపర్ణని కావ్య అడుగగా.. పెసరట్టు చేయమని అపర్ణ చెప్తుంది. అప్పుడే ధాన్యలక్ష్మి వచ్చి ప్రకాష్ తో మాట్లాడుతుంది. ఇక నుండి మన టిఫిన్ నేనే ప్రిపేర్ చేస్తానని ధాన్యలక్ష్మి అనగానే ప్రకాష్ భయపడుతు.. నువ్వా? వద్దని అంటాడు. నేను చేస్తానని ధాన్యలక్ష్మి చెప్తుంది. నువ్వు వెళ్లి పెసరట్టు చెయ్ ఇష్టం ఉన్నవాళ్ళు తింటారని కావ్యకి అపర్ణ చెప్తుంది.
అదంతా పైనుండి చూస్తున్న రాజ్, కళ్యాణ్ ఇద్దరు.. ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారని అనుకుంటారు. మా అమ్మ ఏం చేసినా.. నేను వదిన చేసిన టిఫినే తింటానని కళ్యాణ్ అంటాడు. ఆ తర్వాత టిఫిన్ రెడీ చేస్తున్న కావ్య దగ్గరికి కళ్యాణ్ వచ్చి.. ఇప్పుడు మీకు ఒక మంచి ఛాన్స్. ఇప్పుడు అమ్మ, పెద్దమ్మ గొడవ పెట్టుకుంటున్నారు కదా.. ఇదే అవకాశంగా తీసుకొని ఇప్పుడు నువ్వు ఆఫీస్ కి వెళ్లొచ్చా అని అడుగమని అంటాడు. దానికి కావ్య వద్దని అంటుంది. మీకేం తెలియదంటు ధాన్యలక్ష్మికి వినపడేలా కావ్య, కళ్యాణ్ ఇద్దరు మాట్లాడుకుంటారు. మీరు రేపటి నుండి ఆఫీస్ కి వెళ్ళాలని ఫిక్స్ అయ్యారా అని కళ్యాణ్ అంటాడు. అవును, ఫిక్స్ అయ్యాను. ఎన్ని రోజులు వంటింటికి పరిమితమై ఉంటాను.. ఇంట్లో వాళ్ళు ఏం అన్నా వెళ్తానని కావ్య అంటుంది. నా కొడుకుని అమాయకుడిని చేసి ఈ కావ్య ఆఫీస్ కి వెళ్తుందా? ఎలా వెళ్తుందో నేను చూస్తానని ధాన్యలక్ష్మి అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |